మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 15:27:31

లోయ‌లో చిక్కుకున్న కుక్క‌.. చిరుతిండి ఆశ చూపి బ‌య‌ట‌కు తీశారు!

లోయ‌లో చిక్కుకున్న కుక్క‌.. చిరుతిండి ఆశ చూపి బ‌య‌ట‌కు తీశారు!

కుక్క లోయ‌లో ఎప్పుడు ప‌డిందో ఏమో.. బాగా చిక్కిపోయింది. తిండి లేక అల‌మ‌టించిపోయింది. 30 అడుగుల లోతులో ఉన్న కుక్క‌ను బ‌య‌ట‌కు తీశారు. ప‌ర్వ‌త బైక‌ర్ల బృందమే ఈ కుక్క‌ను బ‌య‌ట‌కు తీసింది. అయితే కుక్క‌ను ర‌క్షించిన విధానం తెలిస్తే అంద‌రూ న‌వ్వుకుంటారు. ప‌ర్వ‌త బైక‌ర్ల బృందం ఉత్త‌ర క‌రోలినా బాట‌లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు కుక్క‌ను గుర్తించారు. దీన్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి కొన్ని స్నాక్స్ ప్యాకెట్స్ తీసుకున్నారు. త‌ర్వాత‌ కొంత‌మంది ర‌క్ష‌కుల‌ను పిలిచారు.

ఆక‌లితో ఉన్న కుక్క‌కు ఆహారం చూపిస్తే ఉత్సాహంతో ప‌రుగులు పెడుతుంది అనుకున్నారు. రెస్క్యూవ‌ర్స్ సింక్‌హోల్ లోప‌లికి వెళ్లి కుక్క‌‌కు మాంసం, స్నాక్స్ ప్యాకెట్స్‌ చూపించారు. త‌ర్వాత జీను సాయంతో కుక్క‌ను బ‌య‌ట‌కు తీశారు. కుక్కకు ఎలాంటి గాయ‌లు త‌గ‌ల్లేదు. చాలా రోజులు బాగా ఆక‌లికి గురైంద‌ని చెబుతున్నారు. కుక్క‌ను ర‌క్షించిన విధానాన్ని రెస్క్యూవ‌ర్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ కుక్క‌కు సింక‌ర్ అని పేరు పెట్టారు. దీని య‌జ‌మానులు దొర‌క్క‌పోతే ఎవ‌రైనా కుక్క‌ను ద‌త్త‌త తీసుకోవ‌చ్చు అని అధికారులు తెలిపారు. 


logo