ఫుట్‌బాల్ మైదానంలోకి దూసుకొచ్చిన కుక్క గేమ్‌కు అంతరాయం కలిగించిన ఘటన చిలీలో వెలుగుచూసింది. రెడిట్‌లో ఈ వీడియోను (Viral Video) పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. చిలీలోని కురికోలో పాలస్తీనా, చిలీ జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Zero regrets. 100% doggo would do it again.
by u/RustyandSugar in AnimalsBeingDerps
మ్యాచ్ జరుగుతుండగా ఫుట్‌బాల్ మైదానంలోకి కుక్క పరుగున రావడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆపై కొద్ది క్షణాల్లోనే బాల్‌ను నోటకరుచుకున్న కుక్క దాన్ని ఇచ్చేందుకు నిరాకరించడం ఈ క్లిప్‌లో చూడొచ్చు. ఆటగాళ్లు కుక్కను పైకెత్తుకుని తీసుకువెళుతుండగా బాల్‌ను జారవిడించింది.
కుక్కను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించడంతో మ్యాచ్‌ను పునరుద్ధరించారు. ఈ పోస్ట్‌కు పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. పసిబిడ్డ తరహాలో కుక్కను సెక్యూరిటీ గార్డు తీసుకువెళ్లడం తనను ఆకట్టుకుందని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More