న్యూఢిల్లీ: మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఏడాదిన్నరకుపైగా సాగి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రైతుల ఉద్యమంపై తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఫార్మింగ్ ద రివల్యూషన్’ ప్రదర్శనకు ఢిల్లీలోని బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరించింది. సోమవారం ఈ విషయాన్ని ‘ఇండియా డాక్ ఫెస్ట్’ నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో పబ్లిక్ స్క్రీనింగ్ ఉపసంహరించుకున్నామని, ఇందుకు తాము చింతిస్తున్నామని, అయితే వేడుకల లక్ష్యం మాత్రం మారలేదని నిర్వాహకులు పేర్కొన్నారు. నిషితా జైన్, ఆకాశ్ బసుమతారి డైరెక్షన్లో రూపొందిన ‘ఫార్మింగ్ ద రివల్యూషన్’ డాక్యుమెంటరీ చిత్రానికి ‘హాట్ డాక్స్-2024’ వేడుకల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ డాక్యుమెంటరీ అవార్డు దక్కింది.