న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష 18వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో తక్షణమే జోక్యం చేసుకుని, ఆయనకు బలవంతంగానైనా ఆహారం అందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ‘నీట్’ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూన్ 28 నుంచి వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష కారణంగా ఆయన సుమారు 8.5 కిలోల బరువు తగ్గినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో వాంగ్ చుక్ ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.