న్యూఢిల్లీ : ఢిల్లీ హెచ్సీఎంసీటీ మణిపాల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. మరణించిన మహిళ శరీరంలో రక్త ప్రసరణ పునఃప్రారంభమయ్యేలా చేశారు. ఈనెల 6న గీత చావ్లా (55) అనే మహిళ కన్నుమూయగా.. ఐదు నిమిషాల తర్వాత, ఆమె పొత్తి కడుపులోని అవయవాలకు రక్త ప్రసరణ జరిగేట్టు చేయగలిగారు.
‘మరణించిన దేహంలో రక్త ప్రసరణను పునరుద్ధరించడం ఆసియాలో ఇదే మొదటిసారి. కాలేయం, మూత్రపిండాలను తీసి, అవయవ దానం కోసం సజీవంగా ఉండేలా చేయగలిగాం’ అని వైద్యులు చెప్పారు. చావ్లా అవయవాలు, కార్నియస్ వెంటనే వేరే రోగులకు కేటాయించారు.