న్యూఢిల్లీ : వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఓ కేంద్ర మంత్రి తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. సదరు కేంద్ర మంత్రిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. గత రాత్రి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయల్దేరారు. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. తలనొప్పిగా ఉందని తెలిపాడు. బీపీ లెవల్స్ కూడా తగ్గాయి.
అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని కేంద్ర మంత్రి గమనించి తక్షణమే వైద్యం అందించాడు. గ్లూకోజ్ అందించడంతో సదరు ప్రయాణికుడు త్వరగా కోలుకున్నాడు. దీంతో ఇండిగో యాజమాన్యం కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్పై ప్రశంసలు కురిపించారు.
A doctor at heart, always!
— Narendra Modi (@narendramodi) November 16, 2021
Great gesture by my colleague @DrBhagwatKarad. https://t.co/VJIr5WajMH