doctor operates on wrong leg | ఒక కాలు బదులు మరో కాలుకు ఆపరేషన్.. డాక్టర్‌పై చర్యలు
doctor operates on wrong leg | గొడవలో ఒక వృద్ధురాలు గాయపడింది. ఆమె రెండు కాళ్లకు ఫ్యాక్చర్ అయ్యింది. కుడి కాలికి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. అయితే పొరపాటు వల్ల మరో కాలికి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యానికి కారణమైన డాక్టర్‌పై చర్యలు చేపట్టారు.
జైపూర్: గొడవలో ఒక వృద్ధురాలు గాయపడింది. ఆమె రెండు కాళ్లకు ఫ్యాక్చర్ అయ్యింది. కుడి కాలికి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. అయితే పొరపాటు వల్ల మరో కాలికి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యానికి కారణమైన డాక్టర్‌పై చర్యలు చేపట్టారు. (doctor operates on wrong leg) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 66 ఏళ్ల చంపా దేవి ఒక గొడవలో గాయపడింది. దీంతో జోధ్‌పూర్‌లోని ఎండీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేరారు.
కాగా, ఆ వృద్ధురాలికి రెండు కాళ్లు విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే ఆమె కుడి కాలికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. ఏప్రిల్ 27న ఆపరేషన్ నిర్వహించారు. పొరపాటున వృద్ధురాలి ఎడమ కాలికి ఆపరేషన్ చేసినట్లు బయపడింది. దీంతో నిర్లక్ష్యం ఆరోపణలపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు తాజాగా ఆ కమిటీ నివేదికను సమర్పించింది. పర్యవేక్షణలో నిర్లక్ష్యమే ఈ పొరపాటుకు కారణమని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకిషన్ చౌదరిపై చర్యలు చేపట్టారు. ఎండీఎం ఆసుపత్రి బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. తదుపరి నియామక ఉత్తర్వుల కోసం వేచి ఉండేలా జైపూర్‌లోని వైద్య విద్యా విభాగానికి బదిలీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

