ఢిల్లీలో ఘటన.. నిందితుడు అరెస్ట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఆర్మీలో లెఫ్టినెంట్ అధికారినంటూ నమ్మించి ఓ డెలివరీ ఏజెంట్.. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫేక్ ఐడెంటిటీతో ఆమెను మోసం చేయడమేగాక, లైంగికదాడికి తెగబడ్డాడు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడు ఆరవ్ మాలిక్(27)ను అరెస్టు చేసినట్టు పోలీసులు సోమవారం తెలిపారు.
దక్షిణ ఢిల్లీలోని ఛాత్తర్పూర్కు చెందిన ఆరవ్ మాలిక్, ఓ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. సోషల్మీడియా ద్వారా బాధిత వైద్యురాలితో నిందితుడికి పరిచయం ఏర్పడింది. ఫేక్ ఐడీ, ఆర్మీ డ్రెస్ ఉపయోగించి ఆమెను మోసగించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ రోజు వైద్యురాలి ఇంటికి వచ్చిన మాలిక్, ఆమెకు ఏదో తినిపించి.. అటు తర్వాత లైంగికదాడికి పాల్పడ్డాడు.