ఇండోర్: దీపావళి రోజున రాముని వేషంలో వస్తారా?.. ఇది శాంటా క్లాజ్ వేషధారణలో ఉన్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి (Food Delivery Boy) ఎదురైన ప్రశ్న. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో.. క్రిస్మస్ కావడంతో శాంటా క్లాజ్ దుస్తులు వేసుకున్న ఓ జొమాటో డెలివరీ బాయ్ వినియోగధారులకు ఫుడ్ సప్లయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూ జాగరన్ మంచ్ ఇండోర్ అధ్యక్షుడు సుమిత్ హర్దియా అతడిని అడ్డుకున్నారు. మీరు శాంటా క్లాజ్‌లా దుస్తులు ధరించి ఆర్డర్‌ని డెలివరి చేస్తున్నారా అని ప్రశ్నించాడు. దీంతా ఆ ఏజెంట్ అవునని చెప్పాడు. ఇలాగే దీపావళి పండుగ నాడు ఎప్పుడైనా రాముని వేశం వేసుకుని ప్రజల ఇండ్లకు వెళ్లారా అని నిలదీశారు. లేదని, కానీ ఇప్పుడు మాత్రం కంపెనీ ఆదేశాలతోనే ఈ దుస్తులు ధరించాలని, ప్రజలకు సందేశం ఇవ్వాలని చెప్పిందని డెలివరీ బదులిచ్చారు. అనంతరం ఆ దుస్తులను అతడు విప్పేశాడు.
మనం హిందువులం. ఇలాంటి దుస్తులు వేసుకుని పిల్లలకు ఏం సందేశం ఇస్తున్నామని సుమిత్ ప్రశ్నించారు. అలాంటి సందేశం ఏదైనా ఇవ్వాలనుకుంటే శాంటాక్లాస్ దుస్తులు వేసుకోవడం తప్పనిసరా అన్నారు. అలాంటప్పుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజావ్లా కూడా దుస్తులు ధరించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది.