న్యూఢిల్లీ: సుప్రీంకోర్ట్ కాంప్లెక్స్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని సరైన మూత ఉన్న చెత్తబుట్టల్లో వేయాలని కోర్ట్ పరిపాలన యంత్రాంగం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. కోర్ట్ వసారాల్లో, లిఫ్టుల్లో వీధి కుక్కల సంఖ్య పెరగడం గమనించిన తర్వాత వెంటనే ఈ సమస్య పరిష్కారానికి తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సరిగ్గా మూత మూసి ఉన్న చెత్త బుట్టల్లోనే మిగిలిపోయిన ఆహారాన్ని వేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో కవర్ చేయని కంటెయినర్లలో ఆహారాన్ని ఉంచి పడేయడం ఇకపై నిషేధం. తద్వారా కుక్క కాటు ప్రమాదాలను తగ్గించవచ్చని కోర్ట్ యంత్రాంగం భావిస్తున్నది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలన్నింటినీ తొలగించి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టుఆదేశించిన మరుసటి రోజే తాజా మార్గదర్శకాలు వెలువడ్డాయి.