విద్వేష ప్రసంగాలను పట్టించుకోవద్దు

- ఉద్రిక్తతలకు యత్నిస్తే చట్టం చూసుకొంటుంది
- హరిద్వార్, ఢిల్లీ ధర్మ సంసద్‌లో వ్యాఖ్యలు స్వామి వివేకానంద బోధనలకు పూర్తి విరుద్ధం
- కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, జనవరి 8: హరిద్వార్, ఢిల్లీల్లో ఇటీవల జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమాల్లో కొంత మంది చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు స్వామి వివేకానంద బోధనలకు పూర్తి విరుద్ధమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రజల మధ్య చీలికలు, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే చట్టం తన పని తాను చేయాలని, అందుకు సహకరించాలని, అనుమతించాలని కోరారు. ఇటువంటి ప్రసంగాలను ప్రజలు తిరస్కరించాలని, వాటికి ఎలాంటి ప్రాముఖ్యం ఇవ్వవద్దని ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ కోరారు. ‘సహనం, సరళత, అందరినీ కలుపుకొనిపోవడంపై మన(హిందూ) మతం ఆధారపడి ఉంది. మన రాజులు ఎవరి ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయలేదు. మేం విస్తరణ వాదులం కాదు. మాకు మంచి కావాలి. ప్రపంచమంతా మంచిగా ఉండాలని కోరుకొంటాం. భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి బాగుండాలని కోరుకొంటాం. ఇది మా వారసత్వం. ఇదీ మా దృక్కోణం. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవారు మాలోని వారు కాదు’ అని వ్యాఖ్యానించారు. షికాగోలో సర్వ మత సమ్మేళనంలో వివేకానంద కూడా ఇదే చెప్పారని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. హరిద్వార్ ధర్మ సంసద్‌లో హిందూ మత గురువులు కొంత మంది.. ముస్లింలను ఊచకోత కోయాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు కేవలం ఐదుగురిపై మాత్రమే కేసు నమోదు అయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- nithin gadkari
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

