చెన్నై, జూన్ 18: వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు సెక్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని సూచించింది. వ్యభిచార గృహంలో ఉన్న విటుడిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. వ్యభిచారం కూడా ఒక వృత్తి అని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించింది. వ్యభిచార గృహం నడపడమే చట్టవిరుద్ధమని గుర్తుచేసింది. దాడి సమయంలో వ్యభిచార గృహంలో ఉన్నాడని విటుడిని అరెస్టు చేయడం సరికాదని స్పష్టం చేసింది.