చెన్నై, మే 7: ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేతో సంబంధాలను తెంచుకుని విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపడాన్ని ఖండిస్తూ డీఎంకే గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నుంచి మా పార్టీ అధ్యక్షుడికి ఒక మర్యాదపూర్వక పిలుపు కాని, ధన్యవాదాలు తెలిపే మాట కాని కనీసం రాలేదు.
బదులుగా కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచింది అని తీర్మానంలో డీఎంకే ఆరోపించింది. అనేక రాష్ర్టాలలో బీజేపీ చేసిందే ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ చేసిందని డీఎంకే పేర్కొన్నది.