చెన్నై: భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో డీఎంకే కలిసేదే లేదని ఆ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ భారతి తేల్చిచెప్పారు. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు రావడం ఒక వ్యభిచార చర్య అని తీవ్రంగా విమర్శించారు. ఒకసారి వెళ్లిపోయిన వారిని ద్రవిడపార్టీ ఎన్నటికీ స్వాగతించబోదన్నారు. ‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ప్రజలు యోగ్యమైన వారికే ఓట్లు వేస్తారు.
నేను అధికార కూటమికి సవాల్ విసురుతున్నా. మీరు ఒక్క మేయర్ సీటు గెలిచినా మీ బలాన్ని మేం ఒప్పుకొంటాం. ఈ సవాల్‌ను అన్నామలైతో పాటు అందరూ స్వీకరించాలి’ అంటూ భారతి చెప్పారు. డీఎంకే ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ లీడర్ మాణిక్యం ఠాకూర్ ముందుగా తన విజయం చూసుకోవాలంటూ భారతి చురకలంటించారు.