Parliament : నీట్ స్కామ్‌పై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష ఇండియా కూటమి కసరత్తు సాగిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై గురువారం జరిగిన ఇండియా కూటమి భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
నీట్ అంశంపై రేపు తాము సభలో నోటీసులు ఇస్తామని డీఎంకే ఎంపీ టీ. శివ వెల్లడించారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమి సమావేశంపై రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ చీఫ్ హనుమాన్ బెనివల్ మీడియాతో మాట్లాడారు.
విపక్షం ఐక్యంగా ఉందని, పార్లమెంట్లో తాము నీట్, అగ్నివీర్, ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర వంటి ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తుతామని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
Read More :
Asaduddin Owaisi | రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, మైనారిటీల సమస్యల ఊసే లేదు : అసదుద్దీన్ ఓవైసీ