DMK blackens Hindi signs | హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు.. బీజేపీ మండిపాటు
DMK blackens Hindi signs | తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల్లరంగుతో కనిపించకుండా చేశారు.
చెన్నై: తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల్లరంగుతో కనిపించకుండా చేశారు. (DMK blackens Hindi signs) ఆదివారం డీఎంకే కార్యకర్తలు పాలక్కాడ్, పాలైయంకోట్టై రైల్వే స్టేషన్‌లోని బోర్టులపై హిందీ పేర్లకు బ్లాక్ పెయింట్ వేశారు. సోమవారం కూడా దీనిని కొనసాగించారు. చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్, జీఎస్టీ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలకు నల్లరంగు పూశారు.
కాగా, హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికార డీఎంకేపై బీజేపీ మండిపడింది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిభాషా విధానంపై డీఎంకే వైఖరి ‘కపటత్వం’ అని విమర్శించారు. వారి సొంత పిల్లలు బహు భాషా పాఠశాలల్లో చదువుతున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ‘డీఎంకే పార్టీ అనేది వారి కుటుంబాలకు, ఇతరులకు భిన్నమైన ప్రమాణాలు కలిగి గందరగోళంగా ఉన్న అవివేకుల సమూహం. ప్రజలను ఆ పార్టీ తప్పు దారి పట్టిస్తోంది’ అని ఎక్స్‌లో ఆరోపించారు.
Had seen a few misguided individuals roaming around with a can of black paint, striking Hindi Letters in opposition to the three-language formula in the New National Education Policy. We would humbly suggest that they visit the Enforcement Directorate and Income Tax Office with…
— K.Annamalai (@annamalai_k) February 24, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

