బెంగళూరు: కుర్చీ కనపడితే కూర్చునే అవకాశాన్ని ఎవరూ వదులుకోకూడదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు న్యాయవాదుల సంఘం శుక్రవారం నిర్వహించిన కెంపెగౌడ జయంతి ఉత్సవాలలో డీకే ప్రసంగిస్తూ, ‘మేమంతా ఖాళీ కుర్చీ కోసం వెదుకుతుంటే ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నప్పటికీ చాలా మంది న్యాయవాదులు నిలబడి ఉండడం చూస్తున్నాను. కుర్చీ దొరకడం అంత సులభం కాదు. మీకు అవకాశం దొరికినపుడు ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా మీరే అందులో కూర్చోవాలి. అవకాశం వచ్చినపుడు దాన్ని వదులుకోవద్దు’ అంటూ ఉద్బోధ చేశారు.కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లో తొందర కానీ, ఒత్తిడి కానీ లేవని ఆయన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ శనివారం స్పష్టం చేశారు.