బెంగళూరు, అక్టోబర్ 29 : బెంగళూరులో సొరంగ రోడ్డు ప్రాజెక్టును సమర్థిస్తూ సొంత కారు లేని అబ్బాయిలకు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యంగ్యంగా స్పందించారు.
అంతకు ముందు డీకే విలేకరులతో మాట్లాడుతూ కార్లను కొనుగోలు చేయడం వెనుక ఉన్న సామాజిక బాధ్యతలు తేజస్వీ సూర్యకు అర్థం కావడం లేదని అన్నారు. కారు కొనకుండా మి మ్మల్ని నేను అడ్డుకోగలనా? అదో సామాజిక బాధ్యత. తమ కుటు ంబ సభ్యులతో కలసి సొంత వాహనాలలో ప్రయాణించాలని ప్రజలు భావిస్తారు. సొంత కారు లేని అబ్బాయికి పిల్లనివ్వడానికి కూడా తల్లిదండ్రులు వెనుకాడుతున్నా రు?’ అని డీకే వ్యాఖ్యానించారు.