Karnataka Deputy CM : కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర పన్నుతున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. మైసూర్లో శుక్రవారం జరిగిన జన్ ఆందోళన యాత్రను ఉద్దేశించి డీకే శివకుమార్ మాట్లాడారు. తాము సిద్ధరామయ్య వెన్నంటి ఉంటామని, కర్నాటకలో మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఐక్యంగా పనిచేస్తామని చెప్పారు.
ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కేంద్ర మంత్రి, జేడీయూ నేత హెచ్డీ కుమారస్వామి ఏం అన్నారనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. జేడీఎస్ పార్టీ అగ్రనాయకత్వం వారి ఎమ్మెల్యేలను ఎదిగేందుకు అనుమతించదని అన్నారు. వారంతా జేడీఎస్ అగ్రనాయకత్వం కనుసన్నల్లో పనిచేయాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పునాదులను బీజేపీ, జేడీఎస్‌లు పెకిలించలేవని స్పష్టం చేశారు. అన్యాయం తలపెట్టిన వారు, పేదల వ్యతిరేకులపైనే తమ పోరాటమని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ జన్ ఆందోళన యాత్రలో భాగంగా మైసూర్ వేదికగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం బీజేపీ, జేడీఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. రాజ్‌భవన్ కేంద్రంగా వారు (బీజేపీ-జేడీఎస్) తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. తనకు భూమి కేటాయించాలని తాను తన పలుకుబడిని ఉపయోగించానని బీజేపీ, జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు.
Read More :
Brutal murder | పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన తనయుడు