Diwali crackers | వాయు కాలుష్యానికి దివాళీ పటాసులు కారణం కాదు : బాణాసంచా తయారీదారులు
వాయు కాలుష్యానికి దివాళీ పటాసులు (Diwali crackers) ప్రధాన కారణం కాదని దేశంలో 90 శాతం బాణాసంచాను తయారుచేసే తమిళనాడు శివకాశీకి చెందిన బాణాసంచా తయారీదారులు స్పష్టం చేశారు.
చెన్నై : వాయు కాలుష్యానికి దివాళీ పటాసులు (Diwali crackers) ప్రధాన కారణం కాదని దేశంలో 90 శాతం బాణాసంచాను తయారుచేసే తమిళనాడు శివకాశీకి చెందిన బాణాసంచా తయారీదారులు స్పష్టం చేశారు. ఫైర్ క్రాకర్స్‌లో నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా తాము జారీ చేసిన ఉత్తర్వులు కేవలం ఢిల్లీకే కాకుండా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపధ్యంలో బాణాసంచా తయారీదారులు స్పందించారు. పటాసులను పేల్చడం ద్వారా కాలుష్యం పెరుగుతుందని కాలుష్య కారకాల్లో లేదని, అన్ని విపత్తులకు తామే కారణమని చెప్పడం వంద శాతం పొరపాటని స్పష్టం చేశారు.
ఢిల్లీ, ఎన్సీఆర్లో 90 శాతం కాలుష్యానికి తొమ్మిది ఇతర కారణాలున్నాయని తమిళనాడు ఫైర్వర్క్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి అబిరుబెన్ పేర్కొన్నారు. కాలుష్య కారకాల్లో తాము ఎక్కడా లేమని గుర్తుచేశారు. గత మూడేండ్లుగా పటాసులను ఢిల్లీ ప్రభుత్వం నిషేధిస్తోందని, అయితే ఢిల్లీలో ఇప్పుడు వాయు నాణ్యత ఎలా ఉందని ప్రశ్నించారు.
పంట వ్యర్ధాలను దగ్ధం చేయడంపై ఢిల్లీ ప్రభుత్వం పంజాబ్‌ను ప్రశ్నించిందని గుర్తుచేశారు. ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకువచ్చినప్పుడు తాము వాటిని పాటిస్తున్నామని తమ జీవనాధారం బాణాసంచా తయారీ పరిశ్రమపైనే ఆధారపడిఉందని అన్నారు. ఏడాదిలో 10 నెలలు బాణాసంచా తయారీలో 8 లక్షల మంది నిమగ్నం కావడంతో వర్షాలు కురవకూడదని కోరుకునే తమిళనాడు జిల్లా శివకాశి ఒక్కటే కావడం గమనార్హం.
Read More :
Diwali shoppers | నకిలీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్స్‌తో అప్రమత్తం : కస్టమర్లకు సైబర్ పరిశోధకుల వార్నింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

