Divorce | ఆగ్రా: యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ భార్య తన భర్త రోజూ స్నానం చేయడం లేదని, తనకు విడాకులు ఇప్పించాలని పెండ్లయిన 40 రోజులకే కోర్టుకెక్కింది. తన భర్త ఒంటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని వాపోయింది.
దీనిపై భర్త స్పందిస్తూ తాను సాధారణంగా నెలకు ఒకసారో, రెండుసార్లో స్నానం చేస్తానని చెప్పాడు. అధికారుల కౌన్సిలింగ్ ఇవ్వడంతో పరిశుభ్రంగా ఉండటానికి అతడు అంగీకరించాడు. అయినా కలిసి ఉండటానికి అతడి భార్య విముఖత వ్యక్తం చేసింది.