ముంబై, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారికి రహస్యంగా విషపు గుళికలు పంపిణీ చేసి, పెద్ద ఎత్తున ప్రజలను చంపేందుకు పన్నిన కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో పుణెకు చెందిన ఫయాజ్ ప్రేమ్ జీ అనే అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 14,900 విష గుళికలు, 50 కిలోల ప్రమాదకర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఊరేగింపులో క్యాప్సూల్స్ తీసుకున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు వొప్పి, వాంతులతో విలవిలలాడిపోయాడు. సమాచారం అందుకున్న బైకుల్లా పోలీసులు డీసీపీ జయంత్ మీనా నేతృత్వంలో అనుమానితుడిని అరెస్టు చేశారు.