న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రభుత్వంలో ఉన్నతమైన పదవి (నామినేటెడ్ పోస్ట్) ఇప్పిస్తామంటూ ఓ ముఠా బాలీవుడ్ నటి దిశా పటాని తండ్రి జగదీశ్ పటానీని మోసం చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తుల ముఠా ఆయన నుంచి రూ.25లక్షలు తీసుకొని, ఆ తర్వాత మొహం చాటేసింది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఐదుగురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. నిందితులెవ్వర్నీ పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు.
ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన జగదీశ్ పటానీ, డీఎస్పీ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అక్కడి ప్రభుత్వంలో అత్యున్నత పదవి ఇప్పిస్తామన్న నిందితుల మాటలను గుడ్డిగా నమ్మి వారికి రూ. 25 లక్షలు సమర్పించుకున్నారు.