(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల పంపకం ఆ పార్టీ శ్రేణుల్లో అసమ్మతిని రాజేసింది. టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు. దాదాపు 47 అసెంబ్లీ సీట్లలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు కమలనాథ్తో పాటు మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన దిగ్విజయ్ సింగ్‌పై అసంతృప్తులు కారాలు మిరియాలు నూరుతున్నారు. కొందరు పీసీసీ కార్యాలయం ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తూ, ఫ్లెక్సీలపై బొమ్మలకు చెప్పుతో కొడుతూ తమ నిరసనలు తెలిపారు. కార్యకర్తల ఆగ్రహావేశాలను చూసి కాంగ్రెస్ అధిష్టానం కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరుగనున్నాయి.