ముంబై, మే 30: మహారాష్ట్రలోని అధికార శివసేన(షిండే వర్గం) శిబిరంలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయని శివసేన(యూబీటీ) అధికార పత్రిక సామ్నా పేర్కొంది. భాగస్వామ్య పక్షమైన బీజేపీ తీరు పట్ల 22 మంది షిండే వర్గ ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు సంతోషంగా లేరని ఆ పత్రిక తెలిపిది.
వారు పార్టీని వీడాలనుకుంటున్నట్టు వెల్లడించింది! ఈ విషయమై అసంతృప్త ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని శివసేన(యూబీటీ) ఎంపీ వినాయక్ రౌత్ తెలిపారు. తమ నియోజక వర్గ సమస్యలను కేంద్రం పరిష్కరించడం లేదన్న శివసేన(షిండే వర్గం) ఎంపీ కీర్తికార్ చేసిన వ్యాఖ్యలు రౌత్ కామెంట్‌కు బలం చేకూరుస్తున్నాయి.