లక్నో : వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నా కొన్ని ప్రదేశాల్లో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కనిపిస్తుంది. తాజాగా యూపీలోని ఓ ఫుడ్‌స్టాల్‌కు వెళ్లిన వికలాంగుల హక్కుల కార్యకర్త, వైద్యుడు సత్యేంద్ర సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ దివ్యాంగుల కోసం నిర్మించిన ర్యాంప్ అసౌకర్యంగా ఉండటంతో సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడది తెగ వైరలవుతోంది.
People only have physical impairments, but it's the society that makes us "disabled" by its infrastructural barriers. Look at the slope, or Mt. Everest in the name of the ramp at Hira Sweets, Vrindawan, which even people with "divine abilities" cannot climb. #Accessibility ♿️ pic.twitter.com/zY28nEwHaq
— Satendra Singh, MD (@drsitu) January 4, 2023
బృందావన్‌లోని ఓ ఫుడ్ స్టాల్ వద్ద దివ్యాంగుల కోసం నిర్మించిన ర్యాంప్ దృశ్యాలను ఆయన ఈ వీడియోలో చూపించారు. ర్యాంప్‌ను ఆయన మౌంట్ ఎవరెస్ట్‌గా అభివర్ణించారు. స్లోప్ పైకి ఎక్కేందుకు ఆయన తన కుక్కతో కలిసి ప్రయత్నించడం కనిపిస్తుంది. పైకి ఎక్కేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించకపోగా స్లోప్ చివర బారికేడ్ అడ్డుగా ఉంచడం కనిపిస్తుంది. ప్రజలు శారీరక వైకల్యంతో బాధపడినా మౌలిక వసతుల లేమితో సొసైటీ తమను వైకల్యానికి గురిచేస్తోందని సింగ్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్టయ్యారు. ఇది భయానకమని ఫుడ్ స్టాల్లో దివ్యాంగులు సులభంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఓ యూజర్ వ్యాఖ్యానించగా, ఇంత ఎత్తున ర్యాంప్‌ను నిర్మించిన వారు ఆస్పత్రిని కూడా మెయింటైన్ చేయాలని మరో యూజర్ సెటైర్ వేశారు. ఆరోగ్యవంతులే ఈ ర్యాంప్‌పై వెళ్లలేరని మరో యూజర్ రాసుకొచ్చారు.