ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 09:25:07

ఢిల్లీలో తొలిసారి పెట్రోల్‌ను మించిన డీజిల్ ధ‌ర‌

ఢిల్లీలో తొలిసారి పెట్రోల్‌ను మించిన డీజిల్ ధ‌ర‌

న్యూఢిల్లీ: ‌దేశ‌వ్యాప్తంగా పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల కొన‌సాగుతున్న‌ది. గ‌త 17 రోజుల నుంచి క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. 18వ రోజైనా బుధ‌వారం మాత్రం డీజిల్ ధ‌ర పెరిగినా పెట్రోల్ ధ‌ర పెరుగ‌లేదు. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో తొలిసారిగా డీజిల్ ధ‌ర‌లు పెట్రోల్ ధ‌ర‌ల‌ను మించిపోయాయి. బుధ‌వారం డీజిల్‌పై మ‌రో 48 పైస‌లు పెరుగ‌డంతో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.79.88కి చేరింది. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.79.76 గా ఉన్న‌ది.                 


logo