Nitish Kumar- Congress | జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ చేసిందన్న జేడీయూ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్ కుమార్ను ప్రధానిని చేసేందుకు ఇండియా కూటమి సంప్రదించిన విషయమై తమ పార్టీకి ఎటువంటి సమాచారం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తేల్చి చెప్పారు. ఆ విషయం గురించి కేవలం ఆయనకే తెలుసు అని పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ 293, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 234 సీట్లలో గెలుపొందాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇండియా కూటమి తన సంఖ్యాబలం పెంచుకోవడానికి ఎన్డీఏ పక్షాలు టీడీపీ, జేడీయూలను కలుపుకోవడానికి ప్రయత్నించిందని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్కు ఇండియా కూటమి ఆఫర్ ఇచ్చిందని జేడీయూ నేత చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.