న్యూఢిల్లీ, జూన్ 13: భారత దేశ తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్ట్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులు కానున్నట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం జనరల్ సేథ్ వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్‌గా ఉన్నారు. ఆయన ఆ పదవిలో ఏప్రిల్ 1 నుంచి కొనసాగుతున్నారు. గత 40 ఏండ్లుగా ఆయన ఆర్మీలో వివిధ హోదాల్లో పని చేశారు.