Dhankhar vs Raut : రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంగళవారం నవ్వులు విరబూశాయి. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. బడ్జెట్‌పై మాట్లాడుతూ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ తనను తాను నాన్ బయాలజికల్ (సాధారణ మనిషిని కాదు) అని చెప్పుకుంటారని, ఈ బడ్జెట్ కూడా నాన్ బయాలజికలే అని చమత్కరించారు.
దాంతో ప్రతిపక్ష సభ్యులందరూ ఘొల్లున నవ్వారు. ఆ తర్వాత తన సంభాషణను కొనసాగిస్తూ బడ్జెట్లో లొసుగులను ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష, అధికారపక్ష సభ్యులను చూస్తూ తన సంభాషణ కొనసాగించారు. దాంతో రౌత్జీ సభ్యులవైపు కాదు, తనవైపు చూస్తూ మాట్లాడండని జగ్దీప్ ధన్కర్ సూచించారు. అందుకు సమాధానంగా.. ‘మీవైపే చూసి మాట్లాడుతా ఛైర్మన్ సాబ్. ఇక్కడ మీకంటే ఎక్కువ నాకు ఎవరున్నరు చెప్పండి’ అంటూ రౌత్ హాస్యం చిందించారు.
దాంతో సభలో మరోసారి నవ్వులు విరబూశాయి. జగ్దీప్ ధన్కర్ సహా అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.