సిమ్లా: శీతాకాలం ప్రారంభం కాకముందే హిమాలయాలకు సమీపంలోని రాష్ట్రాల్లో మంచు కురవడం మొదలైంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహౌల్-స్పితి జిల్లాలోని ధన్కర్ గ్రామాన్ని మంచు దుప్పటి కప్పేసింది. పూర్తిగా కొండలపై ఉన్న ఈ గ్రామంలో ఎటుచూసినా మంచు పేరుకుపోయి.. తేటతెల్లని వస్త్రం పరిచినట్లుగా కనువిందు చేస్తున్నది. చూసేవారి మనసులకు ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నది.
గ్రామ పరిసరాల్లోని కొండలపైనా తెల్లగా మంచు పరుచుకుని ఉన్నది. ధన్కర్ గ్రామస్తులకు ఇలాంటి అందమైన దృశ్యాలను చూడటం కొత్త కాకపోయినా.. పర్యాటకులకు మాత్రం ఇలాంటి వాటిని చూసే అవకాశం అత్యంత అరుదుగా లభిస్తుంది. మరి చూడచక్కని దృశ్యాలను కింది చిత్రాల్లో మీరూ ఒకసారి వీక్షించండి.
Dhankhar village in Lahaul-Spiti district of Himachal Pradesh received snowfall today pic.twitter.com/8F6KTgQldQ
— ANI (@ANI) October 18, 2021