న్యూఢిలీ : దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిబంధనలను కఠినతరం చేసింది. భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతాల్లో అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించేవారిపై జరిమానాలు విధించడంతోపాటు, వారి దగ్గరున్న పరికరాలను జప్తు చేయనున్నట్లు తెలిపింది.
ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని విమాన ప్రయాణ నిషేధిత జాబితాలో కూడా చేర్చే అవకాశం ఉందని కూడా డీజీసీఏ హెచ్చరించింది. సెక్యూరిటీ స్క్రీనింగ్ పాయింట్లు, బోర్డింగ్ గేట్లు, రన్వే బస్సులు, ఎయిర్క్రాఫ్ట్ హ్యాండ్లింగ్ జోన్లలో ఫొటోగ్రఫీని నిషేధించినట్లు డీజీసీఏ పేర్కొన్నది.