వీవీఐపీల విమానాలకు కొత్త నియమావళి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మరో నలుగురు ప్రయాణిస్తున్న చిన్న విమానం ప్రమాదానికి గురి కావడంతో అందరూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ )కేంద్ర, రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు (వీవీఐపీలు) ప్రయాణించే ప్రత్యేక, నాన్ షెడ్యూల్ విమానాలకు సంబంధించి శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
- జారీ చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మరో నలుగురు ప్రయాణిస్తున్న చిన్న విమానం ప్రమాదానికి గురి కావడంతో అందరూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ )కేంద్ర, రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు (వీవీఐపీలు) ప్రయాణించే ప్రత్యేక, నాన్ షెడ్యూల్ విమానాలకు సంబంధించి శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ‘భద్రతపై ప్రభావం చూపే విధంగా ప్రయాణం చేపట్టేందుకు విమాన సిబ్బందిపై అనవసరమైన ఒత్తిడి తీసుకురాకూడదు. వీఐపీల అవసరాల కారణంగా విమాన ప్రయాణంలో చివరి నిమిషంలో చేసే మార్పులు ఏమైనా ఉంటే అవి సంస్థ యాజమాన్యం ద్వారా మాత్రమే సమన్వయం చేసుకోవాలి తప్ప సిబ్బందితో నేరుగా కాదు’ అని కొత్త నిబంధనలు పేర్కొన్నాయి.
ఈ కొత్త నిబంధనలు వీఐపీలు ఇష్టానుసారంగా ఇచ్చే ఆదేశాలకు ‘నో’ చెప్పడానికి వీలు కల్పిస్తున్నాయని ఒక చార్టర్ ఆపరేటర్ తెలిపారు. వాతావరణం, ఇతర సమస్యల కారణంగా విమానం బయలుదేరడం సాధ్యం కాదని చెప్పినా, వీఐపీల బలవంతం కారణంగా వెళ్లి ఇబ్బందులు, ప్రమాదాల్లో పడిన ఘటనలు తాను ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. ఈ కొత్త నియమావళి ఆ ఇబ్బందులను అధిగమిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, జడ్ ప్లస్, ఎస్పీజీ కింద రక్షణ పొందుతున్న వారు, సీజేఐ, సీఎంలు, గవర్నర్లు తదితరులు వీవీఐపీ క్యాటగిరీకి వస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

