న్యూఢిల్లీ: కొత్త విమానయాన సంస్థ ఫ్లై 91కు .. డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఎయిర్ ఆపరేటర్స్ సర్టిఫికేట్‌ను ఆ సంస్థకు అందజేసింది. ఫ్లై 91 సంస్థకు మనోజ్ చాకో బ్యాకప్ ఉంది. ఆ ఎయిర్‌లైన్స్ సంస్థకు రెండు ఏటీఆర్-72 విమానాలు ఉన్నాయి. సెప్టెంబర్ వరకు మరో నాలుగు విమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత రాబోయే అయిదేళ్లలో ప్రతి ఏడాది ఆరు టర్బో విమానాలను జోడించనున్నది. మరికొన్ని రోజుల్లోనే తమ ఆపరేషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. గోవా, బెంగుళూరు, హైదరాబాద్, అగతి, సింధుదుర్గ్, జల్గావ్, పుణె, నాందేడ్‌లో తమ ఎయిర్ స్టేషన్లను స్టార్ట్ చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. తొలుత గోవా నుంచి అగతి, బెంగుళూరు నుంచి అగతి మధ్య విమానాలను స్టార్ట్ చేయనున్నారు.