DGCA | ఈ నెల 5 అలాస్కా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బోయింగ్ 737 మ్యాక్స్-9 విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను తనిఖీ చేయాలలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా విమానాల తనిఖీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని తెలిపింది. బోయింగ్‌కు చెందిన 737 మ్యాక్స్-8 విమానాలను పలు విమానయాన సంస్థలు నడుపుతున్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 7 వరకు వింగ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్లను సక్రమంగా నిర్వహించాలని, వాటిని తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నాలుగు విమానాలు, స్పైస్‌జెట్ ఎనిమిది, అకాసా ఎయిర్ 20 బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాలను నడుతుపుతున్నాయి. ఆయా విమానాల్లో తనిఖీలు సంతృప్తికరంగా సాగాయని డీజీసీఏ తెలిపింది. అకాసా ఎయిర్ ఫ్లీట్‌లో ఒక బీ737-8200 ఎయిర్‌క్రాఫ్ట్ ఉందని, దీనికి మిడ్ క్యాబిన్ డోర్ ఉందని, దాని నిర్వహణకు సంబంధించిన తనిఖీలు సైతం పూరయ్యాయని డీజీసీఏ వివరించింది.