Pawan Kalyan | ముంబై నవంబర్ 23( నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్ కోఠే తెలిపారు.
సోలాపూర్‌లో పవన్ ర్యాలీ, రెండు గంటల రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ఓటర్లు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. దీంతో దేవేంద్ర రాజేశ్ కోఠే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వాటిని పవన్ ఫ్యాన్స్, జన సైనికులు తెగ వైరల్ చేస్తున్నారు.