Modi | హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొదని కితాబునిచ్చారు. అంత కరోనా సమయంలోనూ అభివృద్ధి పనులను ఎక్కడా ఆపకుండా, నిరాటంకంగా కొనసాగించారని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హిమచల్ ప్రదేశ్‌లోని మండీ ప్రాంతంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… రాష్ట్రంలో రెండు రకాల అభివృద్ధి నమూనాలు ఉన్నాయని అందులో మొదటిది సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, రెండోది ఖుద్ కా స్వార్థ్.. పరివార్ కా స్వార్థ్ అని అన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం మొదటి మోడల్‌ను మాత్రమే అనుసరిస్తోందని పేర్కొన్నారు.
భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికే ఆడ పిల్లల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచామని పునరుద్ఘాటించారు. ఇందులోనూ కొందరు తమ స్వార్థ ప్రయోజనాలను చూసుకుంటున్నారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అభివృద్ధి వైపు ప్రభుత్వాలు దృష్టి నిలపడం లేదని, కేవలం తమ కుటుంబ ప్రయోజనాలపైనే శ్రద్ధ చూపుతున్నారని విపక్ష పాలిత రాష్ట్రాలపై మండిపడ్డారు.