న్యూఢిల్లీ, డిసెంబర్ 25: నష్టాలను తట్టుకోవడానికి ఓ పత్రిక ఉద్యోగులను తొలగిస్తుంటే చూడలేకపోతున్న ఎడిటర్ తానే ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నారు. దీని వల్ల తనకు వచ్చే జీతం కంపెనీకి మిగులుతుందని, తద్వారా కొంతమంది ఉద్యోగాలైన మిగులుతాయ ని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయనే డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ ఎడిటర్ పీటర్ భాటియా. భారతీయ అమెరికన్ అయిన ఈయన పులిట్జర్ అవార్డు గ్రహీత కూడా. ‘ప్రస్తుతం సంస్థ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం వాస్తవ మే. ఈ కారణంతో ఉద్యోగులను తొలగిస్తుంటే మనసుకు బాధ కలుగుతున్నది. అందుకే నేనే రాజీనా మా చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నా. నాకు ఇచ్చే జీతం నలుగురు ఉద్యోగులకు ఇవ్వొచ్చు. ఆ నలుగురి ఉద్యోగాలు నిలబడుతాయి. నాకు వేరే అవకాశాలు ఉం టాయి.. అది వేరే విషయం’ అని భాటియా చెప్పారు.