న్యూఢిల్లీ: చంద్రయాన్ ప్రాజెక్టుకు చెందిన కొత్త అప్డేట్స్ ఇచ్చారు ఇస్రో చైర్మెన్(ISRO Chairman) డాక్టర్ ఎస్ సోమనాథ్. చంద్రుడి మీదకు వరుసగా వ్యోమనౌకలను పంపినట్లు చెప్పిన ఆయన.. చంద్రయాన్ 3 సక్సెస్ అయినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం చంద్రయాన్ 4, 5 ప్రాజెక్టు డిజైన్లు పూర్తి అయ్యాయని, ఆ డిజైన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఇస్రో చైర్మెన్ తెలిపారు. ఎల్వీఎం3 రాకెట్ తయారీ ఖర్చును తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎవీఎం3 రాకెట్ తరహాలో కొత్త రాకెట్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఇది పేలోడ్‌ను మూడు రెట్లు అధికంగా మోసుకెళ్తుందని ఆయన తెలిపారు. ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినంగా పాటించనున్నట్లు చెప్పారు. 23ను నేషనల్ స్పేస్ డేగా కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే.
#WATCH | Delhi: ISRO Chairman Dr S Somanath says, “There are so many things. The first and foremost is to rocket side. We have a rocket which is LVM3, which has 4-5 tonnes of capability. But in the coming days, we need to bring down the cost. So, today the cost is though high, it… pic.twitter.com/hhXkKr9Vpm
— ANI (@ANI) August 20, 2024