చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మంగళవారం 16వ సారి 30 రోజుల పెరోల్ లభించింది. ఇద్దరు భక్తురాళ్లను రేప్ చేసిన కేసుల్లో 20 ఏండ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ రోహ్తక్లోని సునరియా జైల్లో ఉన్నారు. 2017లో ఆయన నేరం చేసినట్టు రుజువు కావడంతో జైలు శిక్ష ఖరారైంది.
పెరోల్ కాలంలో గుర్మీత్ సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటారని ఆయన న్యాయవాది తెలిపారు. హర్యానా, దాని చుట్టుపక్కల రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగే ముందు డేరా చీఫ్‌కు పెరోల్ మంజూరు కావడంపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.