న్యూఢిల్లీ: రేప్, హత్య కేసుల్లో రోహ్తక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. 20 ఏండ్ల శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ 40 రోజుల పెరోల్‌పై మంగళవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. తనను తాను భగవంతునిగా ప్రకటించుకున్న డేరా బాబాకు గత ఎనిమిదేండ్లలో ఇలా పెరోల్ మంజూరు కావడం ఇది 14వ సారి. మూడు నెలల క్రితమే ఆయన పెరోల్‌పై బయటకు వెళ్లి వచ్చారు. 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం, 2019లో ఒక జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబా 20 ఏండ్ల శిక్షను అనుభవిస్తున్నారు.