భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఓ మహిళా పోలీసు ఆఫీసర్ దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన బోపాల్‌లోని జహంగిరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తన స్నేహితురాలి ఇంట్లోనే ఆమె నగదు ఎత్తుకెల్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో కల్పనా రఘువంవీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ నుంచి రెండు లక్షల నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిందామె. ఈ ఘటనలో ఆ మహిళా డీఎస్పీపై కేసు నమోదు చేశారు.
డీఎస్పీ కల్పనపై ఆమె స్నేహితురాలు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లిన సమయంలో దొంగతనం జరిగినట్లు ఆమె చెప్ఇపంది. స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లిన సమయంలో డీఎస్పీ కల్పన వచ్చిన క్యాష్, సెల్‌ఫోన్ తీసుకెళ్లిందన్నారు. నగదు, ఫోన్ మిస్ కావడంతో.. సీసీటీవీ పరిశీలిస్తే ఆ సమయంలో డీఎస్పీ కల్పన వచ్చి వెళ్లినట్లు కనిపించింది. చేతుల్లో కరెన్సీ కట్టలు ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో షాకైన ఆ మహిళ.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ కల్పనపై ఫిర్యాదు చేసింది.
సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా రఘువంశీపై చోరీ కేసు పెట్టారు. నిందిత మహిళా ఆఫీసర్ ప్రస్తుతం పరారీలో ఉన్నది. పలు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి. మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు ఏఎస్పీ బిట్టు శర్మ తెలిపారు. అయితే 2 లక్షల నగదు మాత్రం ఆచూకీ లేదు. నిందిత మహిళా పోలీసు ఆఫీసర్‌కు పోలీసు హెడ్‌క్వార్టర్స్ నోటీసులు జార ఈచేసింది. క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నది.