Maharashtra | ముంబై, అక్టోబర్ 4: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తన అనూహ్య చర్యతో అందరినీ షాక్‌నకు గురి చేశారు. మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు. అయితే ఆయన రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన నెట్‌పైనే దూకడంతో ఎలాంటి గాయాలు కాలేదు. ధన్గర్ కులస్తులను ఎస్టీలో చేర్చడాన్ని నిరసిస్తూ జిర్వాల్, ఎన్సీపీ ఎమ్మెల్యే కిరణ్ లహమటే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర శుక్రవారం భవనం పై నుంచి కిందకు దూకేశారు.
అయితే ఆత్మహత్యల నివారణ కోసం రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన వలలో వారు పడటంతో ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ గోపీచంద్ పడల్కర్ మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న జిర్వాల్ లాంటి వ్యక్తి ఇలాంటి దుందుడుకు నిరసనకు దిగాల్సిన అవసరం లేదని అన్నారు.