Deputy CM | చెన్నై, అక్టోబర్ 22: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గటం లేదు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తాజాగా స్పష్టం చేశారు. సోమవారం ఓ ఆదర్శ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ‘తమిళనాడులోనే గాక భారతదేశంలో అనేక చోట్ల నాపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ వక్రీకరణల ఆధారంగా పెట్టారు.
నేను కలైంజ్ఞర్ దివంగత సీఎం కరుణానిధి మనవడ్ని. ఈ అంశంలో క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’ అని అన్నారు. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలని చూస్తున్నారని, నవ వధూవరులు తమకు పుట్టబోయే పిల్లలకు అందమైన తమిళ పేర్లే ఎంచుకోవాలని కోరారు.