ముంబై, నవంబర్ 5: పని ఒత్తిడి ఉద్యోగుల్లో తీవ్రమైన మానసిక సమస్యలకు కారణమవుతున్నదని తాజా సర్వేలో తేలింది. 77 శాతం మంది ఉద్యోగులు మనోవ్యాకులత, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, వారిలో పని సామర్థ్యం కూడా తగ్గిపోతున్నదని వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్ రంగాల్లో పనిచేస్తున్న 1,380 మంది ఉద్యోగులను 2022 సెప్టెంబర్ 5 నుంచి 2022 అక్టోబర్ 15వరకు జీనియస్ కన్సల్టెంట్స్ సర్వే చేసింది. ఇందులో 77 శాతం మంది పని ఒత్తిడివల్ల తాము డిప్రెషన్‌కు గురవుతున్నామని తెలుపగా, ఒత్తిడి తగ్గేందుకు ఓ కునుకు తీసే సమయం ఇవ్వాలని 73 శాతం మంది కోరారు.