Narottam Mishra | టికెట్ నిరాకరణపై కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ మాజీ మంత్రి.. వీడియో వైరల్
Narottam Mishra | ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన బీజేపీ మాజీ మంత్రి అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన సభలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన బీజేపీ మాజీ మంత్రి అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన సభలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Narottam Mishra) మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా భంగపాటుకు గురయ్యారు. ఆయనకు పార్టీ టికెట్ రాకపోవడంతో మద్దతుదారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు.
కాగా, దతియా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన అశుతోష్ తివారీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నరోత్తమ్ మిశ్రా భావోద్వేగానికి గురయ్యారు. తనకు టికెట్ రాకపోవడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. వేదికపై పక్కన కూర్చున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆయనను ఓదార్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన కంచుకోట అయిన దతియాలో నరోత్తమ్ మిశ్రా ఓడిపోయారు. మళ్లీ అక్కడి నుంచి గెలుస్తానని ఆయన వాగ్దానం చేశారు. అయితే దతియాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిని బ్యాంకు మోసం కేసులో దోషిగా కోర్టు నిర్ధారించి జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో శాసనసభ సభ్యత్వాన్ని ఆయన కోల్పోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో పోటికి కున్వర్ ఘన్శ్యామ్ సింగ్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. జూలై 30న పోలింగ్, ఆగస్ట్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
#WATCH | Madhya Pradesh: BJP leader Narottam Mishra gets emotional during the nomination rally of BJP candidate from Datia, Ashutosh Tiwari, ahead of the Datia by-elections. pic.twitter.com/TfkQ9TM7vO
— ANI (@ANI) July 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- candidate rally
- Datia
- denied
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

