రోగికి ప్లాస్మా బదులు బత్తాయి రసం
ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్లడ్‌బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లె చేయటంతో.. అది ఎక్కించిన రోగి మృతి చెందాడు. ఈ ఘటన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖా అయిన ప్రయాగ్‌రాజ్‌లోనే వెలుగుచూడటం కలకలం రేపుతున్నది.
- యూపీలో సైప్లె చేసిన బ్లడ్ బ్యాంకు
- అదే ఎక్కించటంతో రోగి మృతి
లక్నో, అక్టోబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్లడ్‌బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లె చేయటంతో.. అది ఎక్కించిన రోగి మృతి చెందాడు. ఈ ఘటన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖా అయిన ప్రయాగ్‌రాజ్‌లోనే వెలుగుచూడటం కలకలం రేపుతున్నది. ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ దవాఖానలో ఇటీవల ఓ వ్యక్తి డెంగ్యూతో చేరాడు. అతడికి ప్లాస్మా ఎక్కించాలని వైద్యులు చెప్పటంతో సమీపంలోని బ్లడ్ బ్యాంకును ప్లాస్మా కోసం సంప్రదించారు.
బ్లడ్‌బ్యాంకు సిబ్బంది ప్లాస్మా బ్యాగ్‌లో బత్తాయి రసం నింపి ఇవ్వటంతో వైద్యులు దానిని పరిశీలించకుండానే రోగికి ఎక్కించారు. దాంతో రోగి మరణించాడు. ఈ దారుణాన్ని గుర్తించిన రోగి బంధువు ఒకరు బత్తాయి రసం ఉన్న బ్లడ్ బ్యాగును చూపుతూ ఓ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయటంతో కలకలం రేగింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు పోలీస్ అధికారి రాకేశ్‌సింగ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

