ఢిల్లీలో విజృంభిస్తున్న డెంగ్యూ… వెయ్యికి చేరువలో కేసుల సంఖ్య
ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తున్నది. మొత్తం కేసుల సంఖ్య వెయ్యికి దగ్గరగా చేరింది. గత వారంలో కొత్తగా 412 డెంగ్యూ కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతున్నది. సెప్టెంబర్ నెలలో ఈ వ్యాధి బాగా వ్యాపించింది. సెప్టెంబర్ 28 నాటికి ఆ నెలలో మొత్తం 693 డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబర్ 21 వరకు 525 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతరం వారం రోజుల్లోనే కొత్తగా 412 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 937కు చేరింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నివేదికను సోమవారం విడుదల చేసింది. ఆగస్ట్‌లో కేవలం 75 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపింది. అయితే డెంగ్యూ వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని ఆ నివేదికలో పేర్కొంది.
కాగా, 2015లో కూడా ఢిల్లీలో డెంగ్యూ విజృంభించింది. ఆ ఏడాది 10,600కు పైగా మొత్తం కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి ఢిల్లీలో ఇంత భారీ సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదు కావడం అదే మొదటిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

