ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణె అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చి వేస్తున్నారు. ముంబైలోని జుహు బంగ్లా ‘అదీశ్’ను కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మిస్తున్నట్టు తేల్చిన సుప్రీం కోర్టు.. దాన్ని కూల్చి వేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం ఆదేశాలతో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కేంద్ర మంత్రికి కూల్చివేత నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో ఆ భవనంలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేస్తున్నారు.