చెన్నై: చెన్నైలోని కలైనార్ సెంటినరీ హాస్పిటల్ డాక్టర్‌పై బుధవారం ఓ రోగి కుమారుడు దాడి చేయడం కలకలం రేపింది. క్యాన్సర్ బాధితురాలు కాంచన ఈ దవాఖానలో ఆరు నెలల నుంచి చికిత్స పొందుతున్నారు.
ఆమెకు సరైన చికిత్స అందడం లేదని ఆమె కుమారుడు విఘ్నేష్ భావించారు. అతడు బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఔట్‌పేషెంట్ రూమ్‌లో ఉన్న డాక్టర్ బాలాజీ జగన్నాథన్ (53) వద్దకు వెళ్లి, తన తల్లికి జరుగుతున్న చికిత్స గురించి ప్రశ్నించారు. అనంతరం ఇరువురి మధ్య వాదన జరిగింది. విఘ్నేష్ తీవ్ర ఆగ్రహంతో డాక్టర్ బాలాజీ మెడపై కత్తితో దాడి చేశాడు.
ఏడుసార్లు ఆయనను పొడిచాడు. దవాఖాన సిబ్బంది వెంటనే డాక్టర్‌ను ఐసీయూకు తరలించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్లు, నర్సులు ధర్నా చేశారు.